రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఏసోబు అనే ఖైదీ గురువారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏసోబు కొంతకాలంగా మానసిన వ్యాధితో  బాధపడుతున్నాడని జైలు అధికారులు చెప్పారు.

గుంటూరు జిల్లా వల్లివేరుకు చెందిన ఏసోబు ఓ కేసులో  రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. గురువారం నాడు బాత్‌రూమ్‌లోనే ఖైదీ ఏసోబు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  చెబుతున్నారు.