Asianet News TeluguAsianet News Telugu

ముందు ఒకరిద్దరు.. తర్వాత మూకుమ్మడి రాజీనామాలు, ‘‘ముందస్తు’’ కోసం వైసీపీ ప్లాన్ : రఘురామ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు తప్పవన్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.  వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం వుందని ఆయన జోస్యం చెప్పారు. 

ycp mp raghu rama krishnam raju sensational comments on early elections in andhra pradesh
Author
First Published Oct 14, 2022, 8:15 PM IST

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుందని ఆయన అన్నారు. శుక్రవారం రఘురామ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానులకు మద్ధతుగా కొందరితో రాజీనామాలు చేయిస్తారని, ఆ తర్వాత అంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి అసెంబ్లీని రద్దు చేస్తారని రఘురామ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం వుందని.. మూడు ముక్కలాట తప్ప మూడున్నరేళ్లలో ఈ ప్రభుత్వం చేసిందేమి లేదని ఆయన విమర్శించారు. 

ఇకపోతే... 3 రాజధానులకు మద్ధతుగా ఇప్పటికే మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. రాజధాని ప్రాంత రైతులు అరసవల్లి వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అటు మూడు రాజధానులకు మద్ధతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పడిన సంగతి తెలిసిందే. మరోవైపు శనివారం మూడు రాజధానులకు మద్ధతుగా జేఏసీ ‘విశాఖ గర్జన’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

ALso Read:విశాఖ రాజధాని కోసం కరణం ధర్మశ్రీ రాజీనామా.. జేఏసీ కన్వీనర్‌కు లేఖ అందజేత.. రాజీనామా చేయాలని అచ్చెన్నకు సవాలు..

అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో శుక్రవారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వైసిపి మూడు రాజధానుల నిర్ణయానికి మద్దుతుగా ఏర్పడిన జేఏసి నేతలు అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇరువర్గాలు నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద ఎదురుపడటంతో పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అమరావతికి రైతులు ఆకుపచ్చ కండువాలు ఎగురేస్తుండగా.. జేఏసీ నేతలు నల్ల కండువాలు ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేసారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా జాగ్రత్తపడ్డ పోలీసులు అదుపుచేసారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios