పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచడమే తన ఫ్యాషన్ అని రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.


అనంతపురం: పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచడం తన ఫ్యాషన్ అని రాఫ్తాడు ఎమ్మెల్యే Thopudurthi prakash reddy చెప్పారు. శుక్రవారం ఆయన మీడయాతో మాట్లాడారు. తన చరిత్ర ఏమిటో సీఎం Ys Jagan బాగా తెలుసన్నారు. తనతో ఎంతోమంది ఫొటోలు తీయించుకుంటారన్నారు. 

అలాగే కాంట్రాక్టర్ పరమేశ్వర్‌రెడ్డి తనతో ఫొటో తీయించుకుంటే తప్పా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మేడా చంద్రశేఖర్ కాంప్లెక్స్‌ను ఓ బ్యాంక్ వేలం వేస్తుంటే వైట్ మనీతో కొనుగోలు చేశామని తెలిపారు. దానిని 10 కోట్లకు అమ్మి వచ్చిన లాభంతో Hyderabad లో ఫ్లాట్ కొన్నామని ప్రకాష్‌రెడ్డి చెప్పారు.

తమది మొదటి నుండి ఆస్తులున్న కుటుంబమని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు. కానీ 2014లో Tdp అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఆస్తులు అమ్ముకొనేలా చేశారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. విప్లవోద్యమంలో పనిచేశామని చెప్పుకొన్న పరిటాల కుటుంబానికి ఈ ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. విజయవాడ, హైద్రాబాద్ లలో వెళ్లి కథలు చెబితే ఎవరైనా నమ్ముతారేమో కానీ, ఈ ప్రాంత ప్రజలు ఈ కథలను నమ్మరని ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

మాజీ మంత్రి Paritala Sunitha కుటుంబానికి బెంగుళూరు, హైద్రాబాద్ లలో ఆస్తులున్నాయని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి బెంగుళూరు, హైద్రాబాద్ లలో ఆస్తులున్నాయని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ స్పందించారు.

బెంగుళూరు, హైద్రాబాద్ లలో తమకు ఉన్న ఆస్తులను రుజువు చేస్తే ఈ ఆస్తులను ఆర్డీటీ ట్రస్ట్ కు అందిస్తామని Paritala Sriram చెప్పారు. ఈ విషయమై ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై చెప్పారు.తాము ఇల్లు కట్టుకోవడానికి 25 ఏళ్లు పట్టిందన్నారు. ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికైన రెండేళ్లలో ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు.

2009 , 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాఫ్తాడు అసెంబ్లీ స్థానం నుండి పరిటాల సునీత విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాఫ్తాడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ ఓటమి పాలయ్యాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో శ్రీరామ్ ఓటమి పాలయ్యాడు.

వచ్చే ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ స్థానం నుండి పరిటాల శ్రీరామ్ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఈ నియోజకవర్గానికి Tdp ఇంచార్జీగా శ్రీరామ్ ను చంద్రబాబు నియమించారు. 2014 ఎన్నికల్లో ధర్మవరం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన వరదాపురం సూరి విజయం సాధించాడు. 2019 ఎన్నికల్లో మరోసారి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వరదాపురం సూరి బీజేపీలో చేరారు. దీంతో శ్రీరామ్ ను ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీగా చంద్రబాబు నియమించారు.పరిటాల రవి బతికున్న సమయంలో అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్ధుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే పరిటాల రవి మరణంతో అనంతపురం జిల్లాలో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ నేతలే ఒప్పుకొంటున్నారు.