చైతన్యరథ సారథికి.. సారథిగా వ్యవహారించిన కొడాలి నాని

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 29, Aug 2018, 2:01 PM IST
Ycp Mla kodali nani condolence messege to hari krishna death
Highlights

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక.. తండ్రికి బాసటగా నిలిచారు నందమూరి హరికృష్ణ. చైతన్యరథంపై ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చేసిన పర్యటన దేశం మొత్తాన్ని ఆకర్షించింది. చైతన్యరథం ఎక్కడికి వెళ్లినా వాడవాడలా జనం తండోపతండాలుగా అన్నగారికి నీరాజనాలు పట్టేవారు

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక.. తండ్రికి బాసటగా నిలిచారు నందమూరి హరికృష్ణ. చైతన్యరథంపై ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చేసిన పర్యటన దేశం మొత్తాన్ని ఆకర్షించింది. చైతన్యరథం ఎక్కడికి వెళ్లినా వాడవాడలా జనం తండోపతండాలుగా అన్నగారికి నీరాజనాలు పట్టేవారు. ఆ చైతన్యరథాన్ని స్వయంగా నడిపారు హరికృష్ణ.

నడుము పట్టేస్తున్నా... కాళ్లు బొబ్బలెక్కినా హరికృష్ణ తండ్రి కోసం నిద్రాహారాలు మాని శ్రమించారు. అలా చైతన్య రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి హరికృష్ణ ప్రచార రథానికి సారథిగా పనిచేశారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదించి ‘అన్నటీడీపీ’ని స్థాపించారు హరికృష్ణ.

ఈ సందర్భంగా 1999 ఎన్నికల్లో కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన హరికృష్ణ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచార రథానికి నాటి యువనేత, ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి నాని రథసారథిగా వ్యవహరించారు. హరికృష్ణ మరణంపై వైసీపీ నేతలు గుడివాడలో ఏర్పాటు చేసిన  సంతాపసభలో నాని.. హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
 

loader