Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ సంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. రాష్ట్రమంతా వేడుకలు

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు ప్రారంభించి నాలుగేళ్లు నిండిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వేడుకలు జరుపుకున్నాయి. మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, పుప్పాల వాసుబాబు సహా పలువురు నేతలు, పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్ర సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 

ycp leaders celebrates four years for ys jagan padayatra
Author
Amaravati, First Published Nov 6, 2021, 3:42 PM IST

అమరావతి: YCP అధికారంలోకి రావడానికి పూర్వం YS Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశేష ఆదరణ సంపాదించింది. ఈ Padayatraకు శ్రీకారం చుట్టి నాలుగేళ్లు నిండింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వేడకలు చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ leaders, కార్యకర్తలు ఈ సందడి చేస్తున్నారు.

ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర పూర్తి చేసుకుని Four Years పూర్తి చేసుకున్న సందర్భంగా నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓం శక్తి సర్కిల్ దగ్గర వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత పడుతున్న కష్టాలకు ప్రధాన కారకుడు చంద్రబాబు అని ఆరోపించారు. కానీ, వైఎస్ జగన్ ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంకల్పించి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని వివరించారు. మూడువులకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని, అధికారంలోకి వచ్చాక అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని, ఇచ్చిన హామీలకు కట్టుబడ్డ సీఎంగా జగన్ చరిత్ర సృష్టించారు. ఒక సీఎంగా ఇంతలా తపించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని అన్నారు. అందుకే ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం వైస్ జగన్‌దేనని చెప్పారు.

Also Read: పేదల గురించి ఆనాడు వైఎస్సార్,ఈ నాడు జగన్ ఆలోచించారు.. మంత్రి వెల్లంపల్లి

ఇదే సందర్భంగా తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేశారని, ఆ ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వివరించారు. విపక్ష నేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలోని పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పాదయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి శంకరనారాయణ కేక్ కట్ చేసి వేడుక చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.

వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తుడా సర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద సర్వమత ప్రార్థనలు, కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో ఎలా ప్రభంజనం సృష్టించారో.. అదే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టారు. కోట్లాది మంది ప్రజల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి వచ్చి వెంటనే పరిష్కరించారని అన్నారు. 3,648 కిలోమీటర్ల ప్రజాసంకల్ప పాదయాత్ర సువర్ణ చరిత్ర అని వివరించారు.

Also Read: YS Jagan: నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లాకు సీఎం వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇదే..

కర్నూలులో ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి సహా పలువురు వేడులు చేశారు. నెల్లూరులోని గూడూరులో ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ కూడా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం బువ్వనపల్లిలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు వైఎస్ జగన్ పాదయాత్రకు నాలుగేళ్లు నిండిన సందర్భంగా వేడుకలు చేశారు. కాగా, విజయవాడ, చిత్తూరు జిల్లా, వైఎస్సార్ జిల్లాలో వైసీపీ శ్రేణులు వేడకలు చేసుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios