Asianet News TeluguAsianet News Telugu

మా సంసారంలో నిప్పులు పోయకు.. చిరుకి పీవీపీ రిక్వెస్ట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో చేసి చూపించారు. ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు.

YCP Leader, cini Producer PVP Request to Mega star chiranjeevi over be the real man challenge
Author
Hyderabad, First Published Apr 24, 2020, 8:29 AM IST

దయ చేసి మా సంసారంలో నిప్పులు పోయకు అంటూ.. మెగా స్టార్ చిరంజీవిని.. వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ వేడుకుంటున్నారు. పీవీపీ సంసారంలో చిరంజీవి నిప్పులు పోయడమేంటా అని అనుకుంటున్నారా..? అవును ఈ విషయాన్ని స్వయంగా పీవీపీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

YCP Leader, cini Producer PVP Request to Mega star chiranjeevi over be the real man challenge

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా మ‌గ‌వారికి ‘బీ ద రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ ఇప్పుడు సెలబ్రిటీలందరూ స్వీకరిస్తూ.. ఇంటిపనులు చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో చేసి చూపించారు. ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు.

YCP Leader, cini Producer PVP Request to Mega star chiranjeevi over be the real man challenge

 అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈ వీడియోలో చిరు దోశ వేసిన తీరు ఔరా అనిపించేలా ఉంది. ఇప్పుడిదే వీడియోపై నిర్మాత పీవీపీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలా చేసి మా సంసారంలో నిప్పులు పోయవద్దు అంటూ పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. 

‘‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. జోక్స్ పక్కన పెడితే.. మీ నిరంతర ప్రేరణ ప్రశంసనీయం సర్’’ అంటూ పీవీపీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios