Asianet News TeluguAsianet News Telugu

కీచకుడు.. వివాహితకు వైసీపీ కౌన్సిలర్ లైంగిక వేధింపులు.. భర్తను మద్యానికి బానిసచేసి..

ఓ వైసీపీ కౌన్సిలర్ తనను లైంగికంగా వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో చోటు చేసుకుంది. 

YCP Counselor sexual harassment on married women in andhra pradesh
Author
Hyderabad, First Published May 19, 2022, 10:09 AM IST

సత్యసాయి జిల్లా : తనను వేధిస్తున్న YCP Councilor మీద వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. Sri Sathyasai District పెనుకొండ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కౌన్సిలర్ శేషాద్రి కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె భర్తను Liquorనికి బానిసచేసి, తరచుగా ఇంటివద్దకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అర్థరాత్రి ఇంటి తలుపు కొట్టడం, రాళ్లు విసరడం చేస్తున్నాడు. 

దీంతో విసిగిపోయిన బాధితురాలు పదిరోజుల క్రితం శేషాద్రిని పెనుగొండ ఆర్టీసీ బస్టాండు వద్ద చెప్పుతో కొట్టింది. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. అతడి వికృత చేష్టలు భరించలేక బాధితురాలు బుధవారం  పెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వేధింపులు ఆపకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితురాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఓరాజకీయపార్టీకి చెందిన నాయకుడు minar girlపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్లో జరిగింది. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13ఏళ్ల బాలికపై జాంబాగ్ కు చెందిన మజ్లీస్ నాయకుడు రఫిక్ rape attemptకి పాల్పడ్డాడు. పటేల్ నగర్ లోని బాలాజీ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో ఉండే రఫీక్ బాలికను భయపెట్టి తన ఇంట్లోనే లైంగికదాడికి యత్నించాడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబసభ్యులకు బాలిక విషయం తెలపడంతో రఫిక్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. Pocso act కింద కేసు నమోదు చేసిన బేగంబజార్ పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రఫిక్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి చివర్లో నిర్మల్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అభంశుభం తెలియని ఓ బాలికపై rapeకి ఒడిగట్టాడు. ఈ ఘాతుకాన్ని  గోప్యంగా పెట్టే ప్రయత్నం చేశాడు. victim తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. Nirmal డిఎస్పి ఉపేందర్ రెడ్డి కథనం ప్రకారం…నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేటకు చెందిన టిఆర్ఎస్ నేత షేక్ సాజిద్  స్థానిక వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికై… చిన్నవయసులోనే వైస్ చైర్మన్ పదవిని చేపట్టాడు.  ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరైన sajid…అక్కడ ఓ 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. అంతే ఆ బాలికను  శారీరకంగా లొంగదీసుకునేందుకు అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దింపాడు. 

అన్నపూర్ణమ్మ ఆ బాలికను నమ్మించి నిజామాబాద్ వరకు వెళ్లాలి తోడు రమ్మంటూ వెంటబెట్టుకుని వెళ్ళింది. ఆ తర్వాత ‘హైదరాబాదులో ఓ దావత్ ఉంది అక్కడికి వెళుతున్నా.. ఇక్కడిలా కాదు.. అక్కడ గ్రాండ్ గా ఉంటుంది ఫంక్షన్..  నువ్వు కూడా రావచ్చు కదా?’  అంటూ ఆఫర్ ఇచ్చింది. సాయంత్రానికి తిరిగి వచ్చేయొచ్చని.. కారులోనే వెళ్దామని చెప్పింది. దీంతో తెలిసిన మహిళా కదా అని ఆ బాలిక సరే అని చెప్పింది. ఆ తర్వాత ఆ మహిళ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. కాసేపటికి ఒక కారు వచ్చింది. డ్రైవర్, అన్నపూర్ణతో కలిసి ఆ బాలిక కారులో బయలుదేరింది. చార్మినార్ సమీపంలోని ఓ లాడ్జిలో అప్పటికే బస చేసిన వైస్ చైర్మన్ షేక్ సాజిద్ కు ఆ బాలికను అప్పగించింది.

అతను ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను బెదిరించి, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశాడు. భయం భయంగా ఇంటికి వచ్చిన బాలికను... విషయం ఏంటని తల్లి ప్రశ్నించడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది.  దాంతో ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాజిద్ పై పోక్సో, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. sajidకు సహకరించిన అన్నపూర్ణమ్మ, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చిన కారు డ్రైవర్లను నిందితులుగా చేర్చారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని డిఎస్పీ వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు గళమెత్తాయి. ఘటనతో అధికార టీఆర్ఎస్ లో తీవ్ర కలకలం చెలరేగింది. షేక్ సాజిద్ పై రేప్ కేసు నమోదు కావడంతో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios