చంద్రబాబు ప్రభుత్వం తెలుగు భాషను అవమానించిందని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. అసలు ఏపీ ప్రభుత్వానికి తెలుగు బాష అంటే గౌరవం లేదని ఆయన ఆరోపించారు.  ఏపీలో ఇటీవల తాత్కాలిక హైకోర్టు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. హైకోర్టు శిలాఫలకంపై తెలుగులో ముద్రించలేదని.. ఇంగ్లీష్ లో ముద్రించారని ఆయన పేర్కొన్నారు.

చట్ట ప్రకారం తెలుగు భాషలో ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. తాత్కాలిక హైకోర్టు మాత్రమే కాదు.. శాశ్వత హైకోర్టు శంకుస్థాపన శిలాఫలకంపైన కూడా ఇంగ్లీష్ లోనే ముద్రించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.