Asianet News TeluguAsianet News Telugu

టిడిపి నాయకుల హౌజ్ అరెస్ట్.. ఇది జగన్ రూల్ ఆఫ్ లా నా? మండిపడ్డ యనమల

రాష్ట్రంలో జగన్ రూల్ ఆఫ్ లా ప్రత్యేకంగా తెచ్చారా అంటూ యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా గృహనిర్బంధం చేయడంపై శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఖండించారు.

yanamala ramakrishnudu fires on jagan over tdp leaders house arrest - bsb
Author
Hyderabad, First Published Oct 31, 2020, 12:00 PM IST

రాష్ట్రంలో జగన్ రూల్ ఆఫ్ లా ప్రత్యేకంగా తెచ్చారా అంటూ యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమంగా గృహనిర్బంధం చేయడంపై శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఖండించారు.

శాంతియుత నిరసనలను అడ్డుకోవడం గర్హనీయం. ఏపిలో ‘‘రూల్ ఆఫ్ లా’’ ఉందా..?‘‘జగన్ రూల్ ఆఫ్ లా’’ ప్రత్యేకంగా తెచ్చారా..? దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణిచివేత ఏపిలో అమలవుతోంది..ప్రాధమిక హక్కులను కాలరాస్తున్నారు.. రాజ్యాంగ హక్కులను హరించివేశారు.

దరఖాస్తు చేసినా నిరసనలకు అనుమతులు ఇవ్వలేదు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు. ఇలాంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు.
 అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం. 
వైసిపి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలి. జగన్మోహన్ రెడ్డి అణిచివేత పాలనను గర్హించాలి. ప్రాధమిక హక్కులను కాపాడుకోవాలని’’ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

రైతులకు, పోలీసులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ అమరావతి ఐకాస, తేదేపా, రాజధాని పరిరక్షణ సమితి చలో గుంటూరు జైలుకు పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios