టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారని.. దీంతో తాను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి యలమంచలి శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఏపీ కబడ్డీ సంఘం అధ్యక్షుడు వీర్ల లంకయ్య తనపై కక్ష సాధిస్తున్నారని.. శ్రీకాంత్ ఆరోపించారు. టీమ్ సభ్యులను కబడ్డీకి దూరం చేస్తున్నారని.. దీంతో తాను మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీకాంత్.. సెల్ఫీ వీడియో తీసుకొని తాను సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాడో వివరించారు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కాగా.. గమనించిన కుటుంబసబ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.