Asianet News TeluguAsianet News Telugu

భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

తనను వేధిస్తు తనపై వివాహేతర సంబంధం, దొంగతనం అంటకట్టి తనను ఇంటిలోంచి వెళ్లగొట్టారని, తన కుమారుడిని కూడా తన దగ్గరకు రానివ్వడం లేదని బాధితురాలు శ్రావణి తెలిపింది. 

women protest infront of husband house in srikakulam
Author
Hyderabad, First Published Sep 15, 2018, 2:13 PM IST

తన భర్త తనకు కావాలని డిమాండ్ చేస్తూ.. ఓ వివాహిత అత్తారింటి ముందు బైఠాయించింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంజనేయపురం గ్రామానికి చెందిన పెద్దింటి శేఖర్‌కు, దీపావళిపేటకు చెందిన శ్రావణిలకు నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు యుగంధర్‌ ఉన్నాడు. అయితే అత్తమామలు, తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తు తనపై వివాహేతర సంబంధం, దొంగతనం అంటకట్టి తనను ఇంటిలోంచి వెళ్లగొట్టారని, తన కుమారుడిని కూడా తన దగ్గరకు రానివ్వడం లేదని బాధితురాలు శ్రావణి తెలిపింది. అయితే గతంలో పోలీసులను ఆశ్రయించామని వారు ఇరువర్గాలకు సర్ధిచెప్పి నా భర్త వద్దకు చేర్చారని అయితే కట్నం తెమ్మని నన్ను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

లేకపోతే ఇంటినుంచి వెల్లగొట్టారని చెప్పింది. తనను అత్త ఆదమ్మ, మామ వెంకట్రావు, భర్త శేఖర్‌ కట్నం కింద ఆవు, ఫ్రిజ్‌లు తెమ్మంటున్నారని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ విషయమై భర్త శేఖర్‌ను అడుగగా తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, దానికి తోడు తమ గ్రామంలో బంగారం దొంగతనం చేసిందని తెలిపారు. అందుకే తనను ఇంటినుంచి పంపించేశామని భర్త, మామ తెలిపారు. దీంతో ఇరుగ్రామాల పెద్దమనుషుల మధ్య గొడవను పెట్టి సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. గొడవ తేలకపోవడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని భర్త ఇంటిముందు బైఠాయించి ఉన్న శ్రావణి నుంచి, భర్త నుంచి వివరాలు సేకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios