మరిది చేతిలో వదిన దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.... కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన గుండుపాపల మద్దయ్య కుమారుడు మహేంద్రకు, ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన బోయ బాలస్వామి కుమార్తె లక్ష్మీని ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు.

వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. అయితే లక్ష్మీ గత కొంతకాలంగా వరుసగా మరిది అయిన లారీ క్లీనర్ మనోజ్‌‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆమె ఇటీవల మరికొంతమందితోనూ చనువగాను ఉండటంతో మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో 10 గంటల ప్రాంతంలో తన ఇంటికి పిలిపించుకుని.. పిచ్చపాటిగా మాట్లాడి రాత్రి లక్ష్మీ మెడకు చీరతో ఉరి వేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. అయితే లక్ష్మీ ఇంటికి రాకపోవడంతో భర్త గ్రామంలో గాలించి చివరకు వరుసకు తమ్ముడు అయిన మనోజ్ ఇంటి వద్దకు వెళ్లి తాళాలు పగుల గొట్టి చూడగా... ఉరికి వేలాడుతూ కనిపించింది.

తొలుత ఆత్మహత్యగా అనుమానించినప్పటికీ పక్క గదిలో మద్యం బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు కనిపించడంతో సందేహం కలిగింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.