Asianet News TeluguAsianet News Telugu

కోడలిమీద మామ లైంగికదాడి : విడాకుల కోసం వెడితే.. మహిళా నాయకురాలి వేధింపులు..

ఆ సమయంలో మహిళా మండలి నేతగా పరిచయం చేసుకున్న శైలజ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని నమ్మించింది. 2వ తేడీన గీత రీజెన్సీకి పిలిచి ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని అడిగింది. స్వాతి వ్యతిరేకించడంతో శైలజ, ఆమె అనుచరులు ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేష్, నాగుల్ మీరా స్వాతి భర్తకు మద్ధతుగా నిలిచారు

women complaint on harasment in guntur
Author
Hyderabad, First Published Aug 10, 2021, 10:26 AM IST

గుంటూరు : భార్యభర్తల గొడవలో తలదూర్చి మధ్యవర్తులు తనను బెదిరిస్తున్నారని గుంటూరుకు చెందిన స్వాతి అనే యువతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం అర్బన్ ఎస్పీ అరిఫ్ హఫీజ్ కు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం.. ఈ నెల 2వ తేదీన స్వాగి అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్ కు వచ్చి భర్త సందీప్ వేధిస్తున్నాడని, మామ శ్రీనివాసరావు లైంగిక దాడికి యత్నించాడని, తన పాపను చంపేందుకు యత్నించారని ఫిర్యాదు చేశారు.

ఆ సమయంలో మహిళా మండలి నేతగా పరిచయం చేసుకున్న శైలజ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని నమ్మించింది. 2వ తేడీన గీత రీజెన్సీకి పిలిచి ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని అడిగింది. స్వాతి వ్యతిరేకించడంతో శైలజ, ఆమె అనుచరులు ఈమని చంద్రశేఖరరావు, కొర్రపాటి సురేష్, నాగుల్ మీరా స్వాతి భర్తకు మద్ధతుగా నిలిచారు. 

స్వాతి మీద ప్రెస్ మీట్లు పెట్టించి యూట్యూబ్ లో ప్రచారం చేశారు. ఆమె భర్తతో లాలాపేట పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు ఇప్పించారు. తమకు పోలీసు ఉన్నతాధికారులు బాగా సన్నిహితమని, తాము కోరినట్లు నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఫోన్ లోనే పలుమార్లు బెదిరించారు. దళిత నాయకులైన ఈమని చంద్రశేఖర్ రావు, కొర్రపాటి సురేష్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని, రక్సణ కల్పించాలని స్వాతి అర్బన్ ఎస్పీని కోరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios