కష్టాలు తొలగిస్తానని చెప్పి బంగారం, వెండి నగలతో క్షుద్రపూజలు, ఆపై సొత్తు మాయం.. కిలాడీ లేడి లీలలు
కష్టాలను తొలగిస్తానని చెప్పి బంగారం, వెండి నగలు, డబ్బును మాయం చేసిందో కిలాడీ లేడి. క్షుద్రపూజల పేరుతో జనాన్ని మోసం చేస్తున్న మహిళను తిరుపతి వాసులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తిరుపతిలో క్షుద్రపూజల పేరుతో మోసం చేసిందో మాయ లేడి. కష్టాలను తొలగాలంటూ పూజలు చేయాలని చెప్పి నగలను మాయం చేసింది. డబ్బాలో బంగారం, వెండి నగలతో పాటు కొంత నగదును పెట్టి పూజలు చేసింది. ఆ తర్వాత డబ్బాలో బంగారు నగలను మాయం చేసింది. విషయం గుర్తించిన బాధితులు వెంటనే మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. చనిపోయిన తమ కుమార్తె మృతదేహాన్ని ఐదు రోజులుగా ఇంట్లోనే దాచిపెట్టారు తల్లిదండ్రులు. ఆమెను తిరిగి బతికించేందుకు witchcraft చేశారు. మృతదేహం కుళ్లిపోయి.. దాన్నుంచి వాసన వస్తున్నప్పటికీ క్షుద్రపూజలు అలాగే కొనసాగించారు. వాసన భరించలేని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Also Read:క్షుద్రపూజల పేరుతో సొంత చెల్లెలి హత్య.. పేగులు తీసి, ముక్కలుగా నరికి దహనం..!!
ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్ లోని కర్చన ప్రాంతం..దిహా గ్రామానికి చెందిన అంతిమ యాదవ్ (18) అనే యువతి 5 రోజుల క్రితం ఏదో అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందింది. అయితే, ఆమె చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకు తెలియనివ్వలేదు. ఇంట్లో లోపలి నుంచి గడియ పెట్టుకుని.. ఆమెను బతికించేందుకు ఒక మాంత్రికుడితో కలిసి క్షుద్ర పూజలు చేయించారు. ఐదు రోజులు గడుస్తున్నా.. అదే నమ్మకంతో పూజలు చేస్తున్నారు. దీంతో, మృతదేహం కుళ్లిపోయి.. దాని నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. ఆ వాసన మృతురాలి ఇంట్లో నుంచి రావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు చుట్టుపక్కల వాళ్ళు.
సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి అక్కడ జరుగుతున్న తంతు.. దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. యువతి మృతదేహాన్ని వెంటనే పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కూతురిని బతికించుకోవాలని క్షుద్ర పూజలు చేస్తున్న ఆ కుటుంబీకులు ఈ ఐదు రోజుల నుండి ఏమీ తినకుండా.. కేవలం గంగాజలం మాత్రమే తాగుతూ క్షుద్రపూజలో పాల్గొన్నట్లు సమాచారం తెలిసింది. ఐదు రోజులుగా ఏమీ తినక పోవడం.. మృతదేహం కారణంగా ఇంట్లో వ్యాపించిన దుర్వాసనలతో.. ఇంట్లో ఉన్న మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారందరినీ చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి బాగాలేదని.. అందుకే ఈ ఘటనపై వారిని ముందుగా విచారించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.