కృష్ణా జిల్లా గుడివాడలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది

కృష్ణా జిల్లా గుడివాడలో ఓ మహిళా వాలంటీర్ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. 26వ వార్డు వాలంటీరు ప్రత్తిపాటి చంద్రలీల కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి గౌరవ వేతనం చాలక ఓ జిరాక్స్‌ దుకాణంలో పని చేసుకొని జీవిస్తోంది. అయితే చంద్రలీల విధులు సక్రమంగా నిర్వహించడం లేదని మరో వాలంటీర్ ప్రచారం చేసినట్టుగా చెబుతున్నారు. అయితే శుక్రవారం చంద్రలీలను నాగేంద్ర తీవ్రపదజాలంతో దూషించినట్టుగా తెలుస్తోంది. నాగేంద్రకు మరికొందరు కూడా మద్దతుగా ఉన్నారని చెబుతున్నారు. 

అయితే ఈ క్రమంలోనే చంద్రలీల తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించింది. అయితే స్థానికులు ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చంద్రలీల గుడివాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతుంది. తనను దూషించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చంద్రలీల చెబుతుంది. అలాగే కొందరు అధికారుల నుంచి కూడా వేధింపులు ఎదుర్కొంటున్నట్టుగా చంద్రలీల పేర్కొంటున్నారు.