ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులపాటు వారి సంసారం సజావుగా సాగింది. ఆ తర్వాత కొద్దిరోజులకు అత్తారింట్లో భార్యతో సహా తిష్ట వేశాడు. అప్పుడు అతని చూపు మరదిలిపై పడింది. తన భార్యకు ఆరోగ్యంగా సరిగా ఉండటం లేదని ... ఆ కారణం చూపి మరదలిని పెళ్లి చేసుకోవాలని చూసుకోవాలని అనుకున్నాడు. అదే అదనుగా మరదలిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతని వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఒంగోలులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... డిగ్రీ సెకండియర్ చదువుతున్న యువతిని గత కొంతకాలంగా ఆమె బావ సుధాకర్ లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె అక్కను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అత్తవారింట్లో ఇల్లరికం అల్లుడుగా తిష్ట వేశాడు. ఈ క్రమంలో మరదలిపై కన్నేశాడు. 

పలుమార్లు పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తల్లీ, తండ్రి, అక్కను చంపేస్తానని బెదిరించాడు.ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడంతో సుధాకర్ భార్యతో గొడవపడ్డాడు. 

మరదలితో తాను కలిసిన వీడియోలు ఉన్నాయని, అవి బయటపెడతానని బెదిరించాడు. ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సుధాకర్ అసలు స్వరూపం బయడపడంతో వారు రెండో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సుధాకర్ వేధింపులు పెరిగిపోవడంతో యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాము సుధాకర్‌ను పలుమార్లు మందలించామని, అయినా అతనిలో మార్పు రాలేదని యువతి బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.