భార్యభర్తలు అంటే... చివరి వరకు  ఒకరికి మరొకరు తోడు ఉండేవాళ్లు అని అంటారు. అయితే.. ఈ దంపతులు మాత్రం మరణంలోనూ ఒకరికి మరొకరు తోడుగా నిలిచారు. భర్త మరణ వార్త వినగానే.. భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పుత్తూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పుత్తూరు మున్సిపల్‌ పరిధి  గోవిందపాళెంకు చెందిన ఎం.చంద్రయ్యనాయుడు (68) గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలకు తరలించే సమయంలో కడసారిగా భర్త మృతదేహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భార్య ఎం.కుప్పమ్మ (64) కుప్ప కూలి మృతి చెందింది. దీంతో ఇద్దరికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రు. చంద్రయ్య నాయుడు మేస్త్రీ  పనిచేస్తూ జీవనం సాగించేవారు.