Asianet News TeluguAsianet News Telugu

బ్లాక్‌ ఫంగస్‌ తో విశాఖ కేజీహెచ్ లో చేరిన మహిళ మృతి !!

బ్లాక్‌ ఫంగస్‌ తో విశాఖ కేజీహెచ్ లో చేరిన మహిళ మృతి చెందింది. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన విశాఖ మహిళ మృత్యువాత పడింది. ఇది ఇక్కడ తొలి మరణం. నగరంలోని మధురవాడకు చెందిన బాధితురాలు నిరుపేద. ఇటీవలే కరోనా నుంచి కోలుకుంది.

woman dead with black fungus infection in visakha kgh - bsb
Author
Hyderabad, First Published May 18, 2021, 3:34 PM IST

బ్లాక్‌ ఫంగస్‌ తో విశాఖ కేజీహెచ్ లో చేరిన మహిళ మృతి చెందింది. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన విశాఖ మహిళ మృత్యువాత పడింది. ఇది ఇక్కడ తొలి మరణం. నగరంలోని మధురవాడకు చెందిన బాధితురాలు నిరుపేద. ఇటీవలే కరోనా నుంచి కోలుకుంది.

బ్లాక్‌ ఫంగస్‌ వల్ల  ఒక కంటి చూపు పూర్తిగా పోయి, రెండోవ కంటి చూపు పాక్షికంగా దెబ్బతింది. వ్యాధి మెదడుకు సోకిందని చికిత్సకు స్పందించే స్థితిలో రోగి లేదని సంబంధిత వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

రోగి పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు.

కాగా, సోమవారం విశాఖపట్నంలో ఓ బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది. విశాఖ నగరంలోని మధురవాడకు చెందిన ఒక ముప్పయి అయిదేళ్ళ మహిళ బ్లాక్ ఫంగస్ లక్షణాలతో కేజీహెచ్ కి రావడంతో డాక్టర్లు అది ఆ వ్యాధే అని నిర్దారించారు.

విశాఖలో బ్లాక్ ఫంగస్ తొలి కేసుగా దీన్ని భావిస్తున్నారు. కరోనా వైరస్ నయం కావడానికి వాడే అతి మోతాదు మందుల పర్యవసానంగానే బ్లాక్ ఫంగస్ వస్తోందని వైధ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బ్లాక్ ఫంగస్ తొలి కేసు వెలుగు చూడడంతో విశాఖ నగరం వణుకుతోంది.

విశాఖ కేజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ కలకలం...! 35యేళ్ల మహిళలో గుర్తింపు..!!...

ఇదిలా ఉండగా.. కృష్ణా జిల్లాలోనూ తొలి బ్లాక్ ఫంగస్ కేసు బయటపడింది. ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందాడు. దీనిపై కలెక్టర్ ఇంతియాజ్  విచారణకు ఆదేశించారు. 

మృతుడు కాటూరు పంచాయితీ కార్యదర్శి బాణవతు రాజశేఖర్. మొదట అతను కొవిడ్‌తో మృతి చెందినట్లు భావించారు. తర్వాత బ్లాక్ ఫంగస్‌తో రాజశేఖర్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. 

మృతుడి స్వస్థలం ఏ కొండూరు మండల గొల్లమందల గ్రామంగా తెలుస్తోంది. దీంతో బ్లాక్‌ ఫంగస్‌తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

క్రిష్ణా జిల్లాతో పాటు, ప్రకాశం జిల్లాలోనూ షేక్ బాషా అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. 20 రోజుల క్రితం కోవిడ్ సోకడంతో ఆస్పత్రిలో చేరిన షేక్ బాషా.. కరోనానుంచి కోలుకున్నారు.

ఆ తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం ఒంగోలుకు.. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబసభ్యలు చెప్పారు.

అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. బాషా మృతితో ప్రకాశం జిల్లాలో బ్లాక ఫంగస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios