కర్నూలు జిల్లా ఓర్వకల్‌ మండలంలో మహిళ మృతదేహం వెలుగుచూసింది. ఘాట్‌లో కల్వర్ట్ కింద మహిళ మృతదేహం పడేశారు . మహిళ మెడలో రోల్డ్ గోల్డ్ చైన్, డాలర్ గుర్తించారు పోలీసులు. ఈ మహిళకు సంబంధించిన ఆచూకీ తెలియజేస్తే రివార్డ్ అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. 

ఓ డ్రమ్‌లో వెలుగు చూసిన శవం కర్నూలు జిల్లాలో (kurnool district) పోలీసులకు సవాల్‌గా మారింది. ఓర్వకల్ మండలం సోమయాజులపల్లె ఘాట్‌లో మహిళ డెడ్ బాడీ (woman dead body) కనిపించింది. మృతదేహాన్ని డ్రమ్ములో వేసి కాంక్రీట్‌తో సీల్ చేశారు దుండగులు. ఘాట్‌లో కల్వర్ట్ కింద మహిళ మృతదేహం పడేశారు . మహిళ మెడలో రోల్డ్ గోల్డ్ చైన్, డాలర్ గుర్తించారు పోలీసులు. నల్లటి దారాన్ని చుట్టిన డాలర్‌పై ఉర్ధూ అక్షరాలు వున్నాయి. మూడు నెలల క్రితమే హత్య చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు చిక్కుముడి విప్పందుకు గాను మృతురాలి సమాచారం చెప్తే బహుమతి ఇస్తామని ప్రకటించారు.