భర్త మీద కోపం బిడ్డలపై చూపించింది. మనస్తాపంతో కన్న బిడ్డలను స్వయంగా తన చేతులతో నరికేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గంటూరి రంగయ్య, రమణమ్మల కుమార్తె ఆదిలక్ష్మి(25)ని సింగరాయకొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే.. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి తన పుట్టిల్లు ఉప్పలపాడుకు వచ్చింది.

సోమవారం మధ్యాహ్నం భర్తతో ఫోన్ లో మాట్లాడగా.. అతను ఆమెను భూతులు తిట్టాడు. దీంతో.. ఆదిలక్ష్మీ తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. ఈ క్రమంలో.. తన ఇద్దరు పిల్లలను గొంతు కోసి.. తాను కూడా చనిపోవాలని అనుకుంది. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా... పిల్లలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆది లక్ష్మి మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.