ఆలయంలోనే యువతిపై అత్యాచారం, హత్య చేశారా?

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 11, Aug 2018, 3:27 PM IST
Woman Brutal Murder in Nellore
Highlights

పాతికేళ్ల యువతిపై కొందరు దుండగులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. అత్యాచారం అనంతరం యువతిని అత్యంత కిరాతకంగా కత్తులతో దాడిచేసి, ఆ తర్వాత సజీవంగా దహనం చేసి హతమార్చారు. అయితే ఆ యువతిని అక్కడి సమీపంలోని గుడి పరిసరాల్లో అత్యాచారానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోని మనుబోలు సమీపంలో వెంకయ్య స్వామి ఆశ్రమం ఉంది.  ఈ ఆశ్రమంలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తిగా కాలిపోయిన స్థితిలో వున్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్వాడ్ లతో ఆధారాలను సేకరించారు. ఇలా సేకరించిన ఆధారాలతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు, ఈ హత్య ఎలా జరిగిందో వివరించారు.

బాధితురాలిని వెంకయ్య స్వామి గుడి వద్దకు తీసుకువచ్చిన నిందితులు మొదట మద్యం సేవించి, ఆ తర్వాత గుడి పరిసరాల్లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని తెలిపారు. ఆపై కత్తులతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన యువతి పారిపోడానికి ప్రయత్నించి ఉంటుంది. దీంతో వెంబడించి పట్టుకున్న నిందితులు ఆమెను సజీవదహనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
 
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు సంఘటనా స్థలం నుండి ఓ దండ, గాజులు, కూల్‌ డ్రింక్‌ బాటిల్‌, యువతి చెప్పులు, డిస్పోజుబుల్‌ గ్లాసులు, నిందితులు వాడిన బ్లేడ్‌, చిన్న చాకులను స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే ఈ హత్యా మిస్టరీని చేదిస్తామని పోలీసులు తెలిపారు. 

loader