ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో మద్యం షాపు వాచ్‌మెన్ వెంకటేష్ ను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. 

మద్యం దుకాణం వద్ద వెంకటేష్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా మద్యం దొరకడం లేదు. మద్యం కోసం దుకాణాల్లో దొంగతనాలు కూడ చోటు చేసుకొంటున్నాయి.

మద్యం చోరీకి గురి కాకుండా ఉండేందుకు వీలుగా వెంకటేష్ ఈ దుకాణం వద్ద సోమవారం నాడు రాత్రి కాపలాగా ఉన్నాడు. మంగళవారం నాడు ఉదయానికి ఆయన సజీవ దహనమయ్యాడు. మద్యం దుకాణం వద్ద ఉన్న వెంకటేష్ పై ఎవరైనా హత్య చేశారా, ప్రమాదవశాత్తు ఆయన మరణించాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

also read:కరోనా ఎఫెక్ట్: మూడు రాష్ట్రాలు దాటి గుంటూరుకు చేరిన యువకుడు, క్వారంటైన్‌కి

మద్యం దుకాణం వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీని కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు. వంట చేసుకొనే సమయంలో వెంకటేష్ కు ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొన్నాడా లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మృత్యువాత పడ్డారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం కోసం ఎవరైనా వెంకటేష్ ను హత్యచేశారా అనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.