చిత్తూరు జిల్లా రేణిగుంటలో  దారుణం చోటు చేసుకొంది. భార్యాభర్తల మధ్య ఘర్షణలో ఆగ్రహంతో భర్తను హత్య చేసిన భార్య పోలీసులకు లొంగిపోయింది. 

చిత్తూరు: Chittoor జిల్లా reniguntaలో దారుణం చోటు చేసుకొంది భర్తను హత్య చేసి తలతో సహా పోలీసులకు లొంగిపోయింది భార్య.రక్తం బట్టలతో క్యారీ బ్యాగులో తలను తీసుకెళ్తున్న నిందితురాాలిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

రేణిగుంటలోని పోలీస్ లైన్ లో రవిచంద్రన్ తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. ఈ దంపతులకు 20 ఏళ్ల కొడుకుకూడా ఉన్నాడు. గురువారం నాడు భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి లోనైన Ravichandran భార్య కత్తితో భర్తను చంపింది. భర్త చనిపోయిన తర్వాత తలను మొండెం నుండి వేరు చేసింది. భర్త తలను క్యారీ బ్యాగులో తన వెంట తీసుకొని పోలీసులకు లొంగిపోయింది. భర్తను హత్య చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.