కర్నూలు  జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.  కుటుంబంలో నెలకొన్న కలహాలు మొత్తం కుటుంబాన్నే  బలితీసుకుంది. నందికొట్కూరులోని బ్రహ్మంగారిమఠంలో ఈ ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

  రామాంజనేయులు (28) వసంత (26) భార్య భర్తలు.. తమ ఇద్దరు బిడ్డలు  రామలక్ష్మి (7) రమేష్ (5)లను చంపి అనంతరం వారిద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.