Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో మృతి: ఆయన గోల్డ్ స్పాట్ మూర్తి ఎలా అయ్యారంటే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గోల్డ్ స్పాట్ మూర్తి అనే పేరు తెలియని వారుండరు. ముఖ్యంగా విశాఖపట్నం వాసుల నోట్లో నానే పేరు గోల్డ్ స్పాట్ మూర్తి. ఇంతకీ ఎంవీవీఎస్ మూర్తికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా...మరి ఇంకెందుకు ఆలస్యం.. రండి ఓ సారి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

Why MVVS Murthy popular as Gold Spot Murthy
Author
Visakhapatnam, First Published Oct 3, 2018, 4:11 PM IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గోల్డ్ స్పాట్ మూర్తి అనే పేరు తెలియని వారుండరు. ముఖ్యంగా విశాఖపట్నం వాసుల నోట్లో నానే పేరు గోల్డ్ స్పాట్ మూర్తి. ఇంతకీ ఎంవీవీఎస్ మూర్తికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా...మరి ఇంకెందుకు ఆలస్యం. రండి ఓ సారి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. 

1938లో తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి మండలం మూలపాలెంలో జన్మించిన మతుకుమిల్లి వీరవెంకట సత్యనారాయణ మూర్తి కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్ డీ పూర్తి చేశారు. అలాగే ఎంఏ పాలిటిక్స్, బీఎల్ చేసిన మూర్తి కొన్నిరోజులు న్యాయవాదిగా కూడా పనిచేశారు. 

ఉన్నత విద్యావంతుడుగా పేర్గాంచిన మూర్తి ఆ తర్వాత వ్యాపార రంగంపై దృష్టి సారించారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంగా 1967లో విశాఖ బాట్లింగ్ కంపెనీ పేరుతో గోల్డ్ స్పాట్ సాఫ్ట్ డ్రింక్స్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ సాఫ్ట్ కూల్ డ్రింక్ అనతికాలంలోనే లాభాలు గడించడంతో పాటు గోల్డ్ స్పాట్ డ్రింక్ పేరు మార్మోగిపోయింది. 

యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గోల్డ్  స్పాట్ డ్రింక్స్ సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అప్పటి నుంచి ఎంవీవీఎస్ మూర్తి కాస్త గోల్డ్ స్పాట్ మూర్తిగా మారిపోయారు. తాను ప్రారంభించిన సాఫ్ట్ కూల్ డ్రింక్ తన ఇంటి పేరుగా మారిపోయినందుకు ఎన్నోసార్లు ఎంవీవీఎస్ మూర్తి సంతోషపడేవారట. 

1967 నుంచి ఏపీలో గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ పాపులర్ అయ్యిపోయింది. మంచి వ్యాపార వేత్తగా మూర్తి స్థిరపడిపోయారు. ఫలితంగా 1980లో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.  

వ్యాపార రంగంలో రాణించిన గోల్డ్ స్పాట్ మూర్తి ఆ తర్వాత మహిళల విద్య కోసం విశేషంగా కృషి చేశారు. అమలాపురంలో మహిళా జూనియర్ కళాశాలను, విశాఖలో అంబేద్కర్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో సీతారామ డిగ్రీ కాలేజీని స్థాపించారు. తన స్వగ్రామమైన మూలపాలెంలోనూ మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు.  

దివంగత సీఎం ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరారు ఎంవీవీఎస్ మూర్తి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. 1987లో ఉడా చైర్మన్ గా నియమితులైన మూర్తి రెండేళ్లపాటు విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 1991,1999లో రెండు సార్లు విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచారు. 

అలాగే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, సివిల్ ఏవియేషన్ మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా ఎంవీవీఎస్ మూర్తి అందుకున్నారు. ప్రస్తుతం విశాఖజిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.  

Follow Us:
Download App:
  • android
  • ios