Asianet News TeluguAsianet News Telugu

ఈ మూడురోజులూ ఏపీలో వర్షాలు... అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న మూడురోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

weather report... Synoptic features of Weather Inference for AP
Author
Amaravati, First Published Aug 26, 2021, 12:31 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఇవాళ(గురువారం)  ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.  ఉత్తర, దక్షిణ  కోస్తా ఆంధ్రతో పాటు యానాంలో (గురు, శుక్ర, శనివారాలు) మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. 

ఇక రాయలసీమలో ఈ మూడురోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయనా పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.  

read more  విచిత్రం : వర్షాలు కురవాలని.. మద్యం,మాంసం నైవేద్యం..గుళ్లోనే తాగి,తినే సంప్రదాయం...

ఇక మరో తెలుగురాష్ట్రం తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ లో జోరు వానలు కురుస్తున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లా కోటగిరిలో కుంభవృష్టి కురిసింది. ఇక్కడ అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 

కొద్దిరోజులు ముఖం చాటేసిన వర్షాల తిరిగి జోరందుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. ఇకపై వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం వుందన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఆనందాన్ని నింపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios