అమరావతి:అమరావతి భూ కుంభకోణంలో ద‌ర్యాప్తు నిలిపివేయాల‌ని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో స‌వాలు చేస్తామ‌ని వైఎస్ఆర్‌సీపీ
వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. 

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అమ‌రావ‌తి భూ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను మొదటి నిందితునిగా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి కుమార్తెలిద్దరితో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన కేసులో ఏకంగా దర్యాప్తును హైకోర్టు నిలిపేసింది. 

అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలను బహిరంగంగా ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని పత్రికలను, టీవీలను, సోషల్‌ మీడియాను ఆదేశించించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్ర‌తిప‌క్షం మీడియా స్వేచ్ఛ‌ను హ‌రించ‌డం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ ఏజీ ద‌మ్మాల‌పాటి ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డ్డారని ఆయన ఆరోపించారు. 
నిన్న జ‌రిగిన ప‌రిణామాలు కొత్త పోక‌డ‌గా అనిపిస్తున్నాయన్నారు. 

దమ్మాలపాటి శ్రీనివాసరావు కేసులో ప్రాథ‌మిక సాక్ష్యాధారాల‌తోనే  ఏసీబీ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిందని చెప్పారు. టీడీపీ కార్య‌క‌ర్త‌గా ప‌ని చేసిన వ్య‌క్తికి అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా అవ‌కాశం ఇచ్చారని ఆయన ఆరోపించారు.ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పై విచార‌ణ‌లో తొంద‌ర‌పాటు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సిట్ అనేది స్వ‌తంత్ర విచార‌ణ సంస్థ‌ని ఆయన గుర్తుచేశారు.

కోట్లు ఖ‌ర్చు పెట్టి ఢిల్లీ నుంచి న్యాయ‌వాదుల‌ను తెచ్చుకుంటున్నారు.. ఢిల్లీ నుంచి న్యాయ‌వాదుల‌ను తెచ్చుకోవ‌డానికి అంత డ‌బ్బు ఎక్క‌డిదని ఆయన ప్రశ్నించారు. 
టీడీపీ నేత‌లు వ‌ర్ల రామ‌య్య‌, ఆల‌పాటి రాజా వేసిన మ‌రో పిటిష‌న్‌పై కూడాస్టే వ‌చ్చింది.ప్ర‌భుత్వం క‌క్ష‌సాధింపుల‌కు పాల్ప‌డుతుంద‌ని భావిస్తే సీబీఐ విచార‌ణ కోర‌వ‌చ్చు క‌దా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు.

సీబీఐ ద‌ర్యాప్తు చేయాల‌ని ప్ర‌భుత్వం కోరితే ఆ పిటిష‌న్ డిస్మిస్ చేయ‌డం బాధాక‌రమన్నారు. కోర్టులో ఎప్పుడు ఏ కేసు వ‌స్తుందో టీడీపీ నేత‌ల‌కు ఎలా తెలుసునని ఆయన ప్రశ్నించారు. ఇవాళ వ‌చ్చిన జ‌డ్జిమెంట్ గురించి టీడీపీ నేత బోండా ఉమ నిన్న‌నే ఎలా మాట్లాడారో చెప్పాలన్నారు.

చంద్ర‌బాబు అధికారంలో ఉండ‌గా అమ‌రావ‌తి పేరుతో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింది.ఎన్నిక‌ల‌కు ముందే అధికారంలోకి వ‌స్తే దీనిపై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పామన్నారు. .అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.అమ‌రావ‌తిలో వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

రాష్ట్రంలో మ‌తాల మ‌ద్య చిచ్చుపెట్టాల‌నే ప్ర‌య‌త్నం జ‌రుగుతోందన్నారు.ఆల‌యాల్లో ఘ‌ట‌న‌లు చంద్ర‌బాబే చేయిస్తున్నార‌ని అనుమానాలు వ‌్యక్తం చేస్తున్నారు.