జగన్, మోడీ కలిసే చంద్రబాబును జైలుకు పంపారు.. టీడీపీతో కలిసి పని చేసే ఆలోచనలు చేస్తున్నాం: సీపీఐ
చంద్రబాబును జగన్, మోడీ కలిసే జైలుకు పంపించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మోడీ, జగన్‌లు దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేనలు బీజేపీకి దూరంగా జరిగితే వారితో కలిసి పని చేయాలని తాము ఆలోచనలు చేస్తున్నట్టు వివరించారు.

విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును ఏపీ సీఎం జగన్, ప్రధానమంత్రి మోడీ కలిసే జైలుకు పంపించారని ఆరోపించారు. తాము కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని సాగనంపాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి, తమ లక్ష్యం కోసం ఆ పార్టీతో కలిసి పని చేసే ఆలోచనలు చేస్తున్నామని వివరించారు. అయితే.. టీడీపీ, జనసేనలు బీజేపీని వదిలిపెడితే తాము వారితో కలిసి పని చేయడానికి సిద్ధమని తెలిపారు.
విజయవాడలో ఓ మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల కోసం తమతో వచ్చేవారితో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. సీఎం జగన్ దోపిడీ, అరాచకలతో రాష్ట్ర ప్రజలుు విసిగిపోయారని అన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో వెనుకబడిపోయిందని చెప్పారు. అన్ని రంగాలను అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. మోడీ, జగన్‌లు దేశాన్ని, రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
Also Read: రేషన్ కార్డు కేవైసీ చివరి తేదీపై మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్.. ఏమన్నారంటే?
కాబట్టి, వీరిద్దరూ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి, టీడీపీతో కలిసి పని చేయాలని ఆలోచిస్తున్నామని వివరించారు. మోడీ, అమిత్ షాల ప్రమేయంతోనే, ఇంకా చెప్పాలంటే మోడీ, జగన్ కలిసే చంద్రబాబును జైల్లో పెట్టారని ఆరోపించారు.
కాబట్టి, టీడీపీ, జనసేలు ఆలోచన చేయాలని, బీజేపీ నుంచి వారు దూరంగా జరగాలని రామకృష్ణ సూచించారు. బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకుంటే తాము వారిని స్వాగతిస్తామని వివరించారు. అలా కాకుండా బీజేపీతోనే వెళ్లితే పరోక్షంగా వాళ్లు జగన్‌కు మేలు చేసినవారే అవుతారని అన్నారు.