మహిళా సాధికారితకు కట్టుబడి ఉన్నాం: మహిళా దినోత్సవంలో జగన్

మహిళా సాధికారిత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 
 

We are Committed to women empowerment : YS Jagan

విజయవాడ: తమ ప్రభుత్వం మహిళల సాధికారిత కోసం  కట్టుబడి ఉందని ఏపీ సీఎం వైఎస్  జగన్ చెప్పారు. అంతర్జాతీయ women దినోత్సవాన్ని పురస్కరించుకొని Vijayawada ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం YS Jagan ప్రసంగించారు.  జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవుల్లో 54 శాతం మహిళలకు కేటాయించామన్నారు. మున్సిపల్ ఛైర్మెన్ పదవుల్లో 64 శాతం మహిళలే ఉన్నారన్నారు.

 దేశ చరిత్రలో అత్యధిక మహిళా ప్రజా ప్రతినిధులున్న ఏకైక రాష్ట్రం Andhra Pradesh అని ఆయన చెప్పారు. 102 మార్కెట్ కమిటీలకు అక్కా చెల్లెళ్లను చైర్మెన్లుగా నియమించామన్నారు. వాలంటీర్ల ఉద్యోగాల్లో 53 శాతం మహిళలను నియమించినట్టుగా జగన్ చెప్పారు. నామినేటేడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు ఇవ్వాలని చట్టం చేసిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.  డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవులు కూడా మహిళలకే ఇచ్చామన్నారు. 

రెండున్నర ఏళ్లుగా తన సీఎం పదవిని మహిళల అభ్యున్నతి కోసం వినియోగించానని జగన్ చెప్పారు.  చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లు పెడుతూనే ఉన్నారని జగన్ సెటైర్లు వేశారు. 

అమ్మఒడి లాంటి పథకం దేశంలో ఎక్కడైనా ఉందా అని జగన్ ప్రశ్నించారు.ఈ పథకానికి ఇప్పటివరకు రూ. 13వేల కోట్లు ఇచ్చామని సీఎం తెలిపారు.  వైఎస్ఆర్ ఆసరా వడ్డీ పథకం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆయన అడిగారు.  వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రూ. 2354 కోట్లు జమ చేశామన్నారు. తమ 34 నెలల పాలనలో మహిళలకు  1 లక్షా 18 వేల కోట్లను అందించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. 

మహిళల భద్రత కోసం దిశా చట్టం తీసుకొచ్చామన్నారు. నేరాలు తగ్గాలంటే నిందితులకు శిక్షలు త్వరగా పడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే తాము ఈ చట్టంలో ఈ మార్పులు చేశామన్నారు. దిశ చట్టాన్ని  ఆమోదం కోసం కేంద్రానికి  పంపామన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios