ఏలూరు: పోలవరం ప్రాజెక్టులో తొలి అంకానికి శుక్రవారంనాడు ఏపీ ప్రభుత్వం అంకురార్ఫణ చేసింది. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా  డెల్టాకు స్పిల్ వే మీదుగా గోదావరి నీటిని విడుదల చేశారు.ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని,  ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా ఈసీఆర్ఎఫ్‌ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేశారు. స్పిల్‌వే మీదుగా గోదావరి నీటిని విడుదల చేశారు.

also read:తొలి ఫలితానికి అంకురార్పణ: పోలవరం నుంచి నేడే నీటి విడుదల

గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్‌కు విడుదల కానుంది. ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టాకు చేరనున్నాయి. వర్షా కాల సీజన్‌లోనే వరదను మళ్లించడానికి అనుగుణంగా అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తయ్యాయి.

 దీంతో గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేశారు. స్పిల్‌వే మీదుగా 6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లించారు. అతి తక్కువ సమయంలో భారీ పనులు, నిర్మాణాలు పూర్తి చేసి డెల్టాకు నీరందించే ప్రక్రియను మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి  చేసింది.