విజయనగరం జిల్లాలో యువకులు పోలీసుపై దాడి చేయడం కలకలం రేపుతోంది.  రూల్స్ బ్రేక్ చేశరని, తప్పును ప్రశ్నించిన ఎస్సైపై దాడి చేసి రౌడీయిజం ప్రదర్శించారు.అంతేకాదు సివిల్ డ్రెస్ లో ఉన్న ఆ పోలీసు అధికారిని నడిరోడ్డులో ముగ్గురు యువకులు చితకబాదారు.

"

విజయనగరం జిల్లా, శివన్నపేటలోని అత్తగారింటికి వెళ్లిన పాచిపెంట ఎస్సై రమణ.. సివిల్ డ్రెస్‌లో తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో ఖడ్గవలస వద్ద బైక్‌పై యువకులు ట్రిపుల్ రైడింగ్ చేయడంతో పాటు వేగంగా వెళ్తుండగా వారిని వద్దని వారించినందుకు యువకులు ఎస్సైపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. 

దాడిలో ఎస్సైకు స్పల్ప గాయాలయ్యాయి. ఆయన షర్ట్ కూడా పూర్తిగా చిరిగిపోయింది. పోలీస్ అధికారిపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పాచిపెంట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమదైన స్టైల్లో విచారణ మొదలుపెట్టారు.

అయితే పాచిపెంట ఎస్సై రమణ ఆగడాలు మితిమీరడం వల్లే యువకులు అలా రియాక్ట్ అయ్యారని మరో వెర్షన్ వినిపిస్తోంది. 

గతంలో కొందరు మీడియా వ్యక్తులు పై  దాడిచేయడం, పలువురి పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఎస్సై. తాజాగా ఖడ్గవలస జంక్షన్లో శెలవులో ఉన్న ఎస్సై రామణపై యువకులు దాడిచేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.