విశాఖపట్టణం: విశాఖపట్టణం తూర్పు  అసెంబ్లీ స్థానం నుండి రెండో దఫా విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆదివారం నాడు కేసు నమోదైంది.

వైజాగ్ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో రామకృష్ణ బాబు జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశఆరు. మోడీ, జగన్‌పై కూడ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రామకృష్ణబాబుపై కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.