Vizag Fishing Harbour Fire : మంట పెట్టింది ఉప్పుచేపా? సీసీ టీవీలో వెలుగు చూసిన మనుషులా? (వీడియో)

ఫిషింగ్ హార్బర్ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. అయితే వారిద్దరూ ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Vizag Fishing Harbour: Salted fish set on fire? Are the people who saw the light on CCTV? - bsb

విశాఖపట్నం : ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు రోజుకో విధంగా మారుతున్నాయి. అసలు ప్రమాదానికి కారణాలు ఏంటనే విషయంపై ఆరా తీస్తున్న పోలీసులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. అగ్ని ప్రమాదం అనుకోకుండా జరిగిందా? లేక ఎవరైనా కావాలనే  ఉద్దేశపూర్వకంగా మంట పెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేసు అనేక మలుపులు తిరుగుతూ చివరికి ఉప్పు చేప దగ్గర వచ్చి ఆగింది. కోట్ల రూపాయల నష్టానికి కారణం ఒక ఉప్పుచేప అని తెలిసి పోలీసులు, మత్స్యకార కుటుంబాలు  అయోమయంలో పడ్డారు. దీనికి సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఫిషింగ్ హార్బర్ లోఉన్న బోర్డులో అగ్ని ప్రమాదం జరిగిన రాత్రి యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పార్టీ చేసుకున్న సంగతి తెలిసిందే. 

అయితే, ఆ పార్టీలో భాగంగా లోకల్ బాయ్ నాని  బంధువు  మందులో మంచింగ్ కోసం ఉప్పు చేపను వేయించడంతోనే నిప్పురవ్వలు చెలరేగి బోటులో ఉన్న నైలాన్ తాళ్ళ మీద పడడంతో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అతను నానికి వరుసకు మామ అవుతాడని సమాచారం.అంతకుముందు ఆ బోటులోనే అతను పని చేశాడట. ఈ ప్రమాదంలో 40 బోట్లు పూర్తిగా కాలిపోగా తొమ్మిది బోట్లు పాక్షికంగా దద్దమయ్యాయి.

మరోవైపు ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ప్రమాదానికి రెండు నిమిషాల ముందు  బోటులో నుంచి ఇద్దరు వ్యక్తులు బయటికి వచ్చినట్లుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది.  ప్రమాదం జరిగిన రోజు రాత్రి 10:48 నిమిషాలకి బోటులో నుంచి బయటికి వస్తే ఇద్దరు వ్యక్తులు కనిపించారు.  ఆ తర్వాత రెండు నిమిషాలకే  అంటే 10.50 కి బోటులో మంటలు చెలరేగాయి.

 వాటిని ప్రమాదానికి ముందటి ఈ వీడియో వెలుగులోకి రావడంతో ప్రస్తుతం చర్చ.నీయాంశంగా మారింది. అగ్ని ప్రమాదానికి ముందు హార్బర్ లో ఉన్న ఆ ఇద్దరు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆ సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేశారు పోలీసులు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios