Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నం వెస్ట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

వైసిపి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖపట్నంను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు మారిపోయాయి... ఇలాగే విశాఖలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో గెలుపుపై ఉత్కంఠ ఏర్పడింది. ఇక్కడ ఇప్పటివరకు టిడిపి విజయం సాధించగా ఈసారి రాజధాని ప్రకటన అంశం వైసిపికి కలిసివస్తుందేమో చూడాలి. 

Visakhapatnam West assembly elections result 2024 AKP
Author
First Published Mar 23, 2024, 4:03 PM IST

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు :

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ బలంగా వుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ లో రెండుసార్లు (2014, 2019) అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా రెండుసార్లు టిడిపిదే విజయం. పిజివిఆర్ నాయుడు గత పదేళ్లుగా విశాఖ పశ్చిమ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు.  ఈసారి కూడా అతడే విశాఖ పశ్చిమలో పోటీ చేస్తున్నాడు. 

గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యంకాకపోవడంతో ఈసారి ఎలాగైనా విశాఖ పశ్చిమ నియోజవకర్గంలో జెండా ఎగరేయాలని వైసిపి భావిస్తోంది. అందుకోసమే బలమైన కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. 

విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి :

1. విశాఖపట్నం పరిధిలోని 35, 56 నుండి 71 వరకు గల వార్డులు

విశాఖ పశ్చిమ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  2,36,625
పురుషులు -    1,22,099
మహిళలు ‌-    1,14,518

విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

 వైసిపి అభ్యర్థి :

ఆంధ్ర ప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల కార్పోరేషన్ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ను విశాఖ పశ్చిమ నియోజకవర్గం పోటీలో నిలిపింది వైసిపి. అతడు శ్రీ విజయ విశాఖ డెయిరీ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ గత రెండుసార్లుగా గెలుస్తూవస్తున్న పీజీవిఆర్ నాయుడు (పెతకంశెట్టి గణ వెంకట రెడ్డి నాయుడు) అలియాస్ గణబాబును మరోసారి బరిలో దింపింది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానన్న ధీమాతో నాయుడు వున్నాడు.  

విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

విశాఖ పశ్చిమ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,37,779 ఓట్లు (58 శాతం)

టిడిపి - పిజివిఆర్ నాయుడు - 68,699 ఓట్లు (50 శాతం) - 6,464 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - మళ్ల విజయ్ ప్రసాద్ - 49,718 ఓట్లు (36 శాతం) - ఓటమి

విశాఖ పశ్చిమ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

టిడిపి- పిజివిఆర్ నాయుడు - 76,791 (56 శాతం) - 30,857 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - దాది రత్నాకర్ - 45,934 (33 శాతం) - ఓటమి

Follow Us:
Download App:
  • android
  • ios