Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కొనసాగుతున్నారు. అయితే గత రెండుసార్లుగా గణేష్ తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి గెలిచారు... కానీ ప్రస్తుతం ఆయన వైసిపిలో కొనసాగుతున్నారు. ఇలా గతంలో టిడిపి నుండి పోటీచేసిన ఆయన ఇప్పుడు వైసిపి తరపున పోటీ చేస్తున్నారు. కాబట్టి విశాఖ ప్రజలు గతంలో మాదిరిగానే ఆయనను ఆదరిస్తారా లేక తిరస్కరిస్తారా అన్నది చూడాలి.   

Visakhapatnam South assembly elections result 2024 AKP
Author
First Published Mar 23, 2024, 5:55 PM IST

విశాఖ సౌత్ నియోజకవర్గ రాజకీయాలు :

విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో మాదిరిగానే దక్షిణంలో కూడా టిడిపి బలంగా వుంది. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుతర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ టిడిపి గెలిచింది. వాసుపల్లి గణేష్ కుమార్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే కాస్త వైసిపిలో చేరిపోయారు. 

టిడిపి నుండి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లికే వైసిపి టికెట్ కేటాయిస్తోంది. ఇక పొత్తులో భాగంగా ఈసారి టిడిపి కాకుండా జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తోంది.  

విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి :

1. విశాఖపట్నంలోని 12 నుండి 34 వరకు, 42, 43 మరియు 46 నుండి 48 వరకు గల వార్డులు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 

విశాఖ దక్షిణ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  2,09,356
పురుషులు -    1,04,826
మహిళలు ‌-    1,04,501

విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఈసారి వైసిపి తరపున పోటీ చేస్తున్నారు. ఆయన 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుండి పోటీచేసి గెలిచారు. 

జనసేన అభ్యర్థి : 

టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా విశాఖ సౌత్ లో వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకి కేటాయించడంతో ఈయన్ని ఎంపిక చేసారు. జనసేన అధికారికంగా ప్రకటించకున్నా వంశీకృష్ణ యాదవ్ కు అధినేత పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ అందినట్లు సమాచారం. 

విశాఖ సౌత్  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

విశాఖ దక్షిణ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,28,160 ఓట్లు (61 శాతం)

టిడిపి - వాసుపల్లి గణేష్ -  52,172 ఓట్లు (41 శాతం) - 3,729 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - ద్రోణంరాజు శ్రీనివాసరావు - 48,443 ఓట్లు (38 శాతం) - ఓటమి
 
జనసేన పార్టీ ‌- గంపల గిరిధర్ - 18,119 (14 శాతం)

 విశాఖ సౌత్ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,29,613 ఓట్లు (65 శాతం)

టిడిపి - వాసుపల్లి గణేష్ కుమార్ - 66,686 (51 శాతం) - 18,316 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - ద్రోణంరాజు శ్రీనివాసులు - 48,370 (37 శాతం) - ఓటమి


 

Follow Us:
Download App:
  • android
  • ios