విశాఖపట్టణం: విశాఖపట్టణంలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన దివ్య కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు  వెలుగు చూస్తున్నాయి.దివ్య కుటుంబంలో గతంలో మూడు హత్యలు జరిగిన విషయాన్ని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. 2015లో దివ్య తల్లి, అమ్మమ్మ, తమ్ముడు హత్యకు గురయ్యారు. 

also read:అందాన్ని ఎరగా వేసి వ్యాపారం., డబ్బు విషయంలో గొడవ.. చివరకు..

ఈ హత్యలకు గల కారణాలు ఇంతవరకు తెలియరాలేదని సమాచారం. ఈ హత్యలు ఎవరు చేశారు. ఈ హత్యలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఉన్న దివ్య పిన్నిని పోలీసుుల శనివారం నాడు విశాఖ జిల్లాకు రప్పించారు. శనివారం నాడు మధ్యాహ్నం దివ్య పిన్ని విశాఖపట్టణానికి వచ్చింది.

దివ్య మృతదేహం ఉన్న కేజీహెచ్ ఆసుపత్రి వద్దకు దివ్య పిన్ని వచ్చింది. దివ్యను హత్యకు వసంతతో పాటు మరొక మహిళ కూడ కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ విషయమై ఆదివారం నాటికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.