Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ప్రేమోన్మాది ఘటన : చికిత్స పొందుతూ మృతి చెందిన హర్షవర్థన్...

ఈ నెల 13న యువతిపై పెట్రోల్ పోసి, తానూ నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమోన్మాది హర్షవర్థన్ మృతి చెందాడు. యువతి పెళ్లికి నిరాకరించిందన్న కారణంగానే హర్షవర్ధన్ దాడికి పాల్పడ్డాడని వార్తలొచ్చాయి. పెట్రోల్ దాడి కారణంగా మంటల్లో తీవ్రంగా గాయపడిన యువతి కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. 

Visakha petrol attack incident accussed harshavardhan died in KGH hospital, vishakapatnam
Author
Hyderabad, First Published Nov 16, 2021, 10:40 AM IST

విశాఖపట్నంలోని సూర్యాబాగ్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు హర్షవర్ధన్ మృతి చెందాడు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయాడు. ఈ నెల 13న యువతిపై పెట్రోల్ పోసిన హర్షవర్థన్ తానూ నిప్పంటించుకున్నాడు. యువతి పెళ్లికి నిరాకరించిందన్న కారణంగానే హర్షవర్ధన్ దాడికి పాల్పడ్డాడని వార్తలొచ్చాయి. పెట్రోల్ దాడి కారణంగా మంటల్లో తీవ్రంగా గాయపడిన యువతి కేజీహెచ్ లో చికిత్స పొందుతోంది. 

అసలేం జరిగిందంటే.. 
Suryabagh ప్రాంతంలోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం ఒక యువతీ, యువకుడు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు కలకలం రేపాయి. హోటల్ సిబ్బంది, స్థానికులు తలుపులు తెరిచి వారిని రక్షించి కేజీహెచ్ కు తరలించారు. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా Bhupalapalliకి చెందిన పలకల హర్షవర్ధన్‌ (21),   నగరంలో కరాస ప్రాంతానికి చెందిన ఓ యువతి (20, పంజాబ్‌లోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నారు. వీరిద్దరికి కాలేజ్‌లో పరిచయం ఉంది. అయితే Harshavardhanయువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టుగా చెబుతున్నారు. 

హర్షవర్దన్ గత శుక్రవారం విశాఖలోని హోటల్‌కు చేరుకున్నాడు. అతడు వచ్చిన విషయం చెప్పి.. మాట్లాడాలని కోరడంతో యువతి కూడా హోటల్‌కు వచ్చింది. అయితే అక్కడ యువతిని తనను పెళ్లి చేసుకోవాలని హర్షవర్దన్ కోరాడు. అయితే అందుకు woman నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హోటల్‌ల్ గదిలోనే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై కూడా petrol పోసుకుని నిప్పంటించుకున్నాడు.

Visakhapatnam: విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం.. హోటల్ గదిలో అసలు ఏం జరిగింది..?

హోటల్ గదిలో నుంచి అరుపులు, మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వారిద్దరిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. ఇద్దరి శరీరాలు 60 శాతం మేర burn అయినట్టుగా పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఇన్‌చార్జి హార్బర్‌ ఏసీపీ శిరీష సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వారిద్దరికీ KGHలో చికిత్స కొనసాగుతోంది. ఈ క్రమంలోనే హర్షవర్థన్ మృతి చెందాడు. 

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. యవకుడు పెట్రోల్ ఎక్కడ కొనుగోలు చేశాడు.. వంటి వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా కాలేజ్‌లో వారి మిత్రులతో మాట్లాడి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు హోటల్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలించారు. 

ఏపీకి తప్పిన వాయు'గండం'... వాతావరణ శాఖ గుడ్ న్యూస్

మరోవైపు కూతురికి ఇలా జరిగిందని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుమద్దుగా పెంచుకున్న ఇలా చూసి తట్టుకోలేకపోతున్నారు. అయితే ఈ ఘటన తర్వాత యువతి హోటల్‌ గదిలో ఏం జరిగిందనే దానిపై తన తండ్రితో మాట్లాడుతూ వివరించినట్టుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios