ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. లేకపోతే ఫలితం అనుభవిస్తావు: రఘురామపై విశాఖ ఎంపీ ఫైర్

రసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ ఫైరయ్యారు.
-గత కొంత కాలంగా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పైన ఇతర  పార్టీ నాయకుల పై రఘురామకృష్ణంరాజు ఆరోపణలు తారాస్థాయికి చేరుకొన్నాయన్నారు.
 

Visakha MP MVV satyanarana serious comments on Raghurama krishnama raju lns

విశాఖపట్టణం:నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ ఫైరయ్యారు.-గత కొంత కాలంగా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పైన ఇతర  పార్టీ నాయకుల పై రఘురామకృష్ణంరాజు ఆరోపణలు తారాస్థాయికి చేరుకొన్నాయన్నారు.ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అందరి దృష్టిని తన వైపు మరల్చు దామని ఆయన చేస్తున్న చేష్టలు గర్హనీయమన్నారు. ఇలాంటి  వారికి సాధారణ పరీక్షలే కాకుండా మానసిక పరీక్షలు కూడా చేయించాలని  ఆయన కోరారు.రఘురామకృష్ణంరాజుకి మతిభ్రమించిందని తనకు అనిపిస్తోందన్నారు. 

also read:సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రికి రఘురామ తరలింపు: జైలు నుంచి బయలు దేరిన కాన్వాయ్

సహచర ఎంపీల తోటే కాకుండా, భారతదేశంలో పలు రాష్ట్రాల నుంచి ఎంపికై పార్లమెంట్ కి వచ్చిన ఎంపీ ల తో పరిచయాలకే ఆయన ఎల్లప్పుడూ ఆసక్తి  చూపించేవారన్నారు. సాధారణ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి మెజారిటీతో గెలిచానని విర్రవీగుతున్న రఘురామకృష్ణంరాజు ఆ ఓట్లు జగన్ దయతో జగన్ ను చూసి ప్రజలు వేసిన ఓట్లని గుర్తుంచుకోవాలన్నారు.నిజంగా తన  చరిష్మా తో గెలిచానని రఘురామ కృష్ణంరాజు భావిస్తే దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి ప్రజా కోర్టులో గెలవాలని సవాల్ విసిరారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో తన స్వగ్రామం ఉందని ఆయన గుర్తు చేశారు.   గెలిచిన తర్వాత కరోనా తో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఏనాడు అటుపక్క రాజు నియోజకవర్గంలో  పర్యటించలేదన్నారు.

పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని ఎగవేసి ఇప్పుడేమో వేదాలు వల్లించడం సరికాదని ఆయన హితవు పలికారు.  తనపై ఉద్దేశ్యపూర్వకంగా పలువురు  దాడి చేశారని వాపోతున్నాడు.ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీకి కోవర్ట్ గా ఉంటున్నావో  ప్రజలందరికీ తెలుసునన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో భారతదేశంలో అన్ని కులాలు మతాలు ఒకే తాటిపైకి వచ్చి సేవలు అందజేస్తుంటే రాజు మాత్రం అందుకు భిన్నంగా కులాలని మతాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు.కోట్ల మంది ప్రజలు వైఎస్ జగన్ గారి పరిపాలన వచ్చి ఆయనకు ఓటు వేసి ముఖ్యమంత్రిని చేస్తే అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని, నీకు ఇష్టం వచ్చినట్లు దూషిస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? అని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చిల్లర వ్యవహారాలు మానుకుంటే మంచిది... లేకపోతే తగు ఫలితం అనుభవిస్తారని ఆయన హెచ్చరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios