Asianet News TeluguAsianet News Telugu

భోగీలను వదిలేసి ఇంజన్ తో వెళ్లిపోయిన డ్రైవర్: భయంతో కేకలు వేసిన ప్రయాణికులు

భోగీలను వదిలేసి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. భయంతో కేకలు వేశారు. మధ్యలో నిలిచిపోవడంతో ఎటువైపు నుంచి ట్రైన్ వస్తుందోనని తెలియక టెన్షన్ పడ్డారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. 

 

visakha express train driver forget bhogis, passengers tension feel 20 minutes
Author
Tuni, First Published Aug 19, 2019, 7:27 PM IST

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెనుప్రమాదం తప్పింది. విశాఖ వెళ్లాల్సిన ట్రైన్లు తుని రైల్వే స్టేషన్ వద్ద క్రాసింగ్ కావాల్సిఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎక్స్ ప్రెస్ డ్రైవర్ భోగీలను వదిలేసి ముందుకు వెళ్లిపోయాడు. సుమారు పది కిలోమీటర్ల మేర డ్రైవర్ ఇంజన్ తో వెళ్లిపోయాడు. 

భోగీలను వదిలేసి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. భయంతో కేకలు వేశారు. మధ్యలో నిలిచిపోవడంతో ఎటువైపు నుంచి ట్రైన్ వస్తుందోనని తెలియక టెన్షన్ పడ్డారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. 

దాంతో భోగీలు వదిలి వెళ్లిపోయిన డ్రైవర్ వెనక్కి వచ్చాడు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఇంజన్ రాకపోవడంతో తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందారు ప్రయాణికులు. డ్రైవర్ వచ్చి భోగీలకు ఇంజిన్ అమర్చి యదావిధిగా తీసుకెళ్లాడు. అయితే ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా హమ్మయా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios