తూర్పుగోదావరి జిల్లాలో ఓ గ్రామవాలంటీర్ అఘాయిత్యానికి తెగబడ్డాడు. మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని, నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
తూర్పుగోదావరి : Village Volunteer గా పని చేస్తూ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఓ minor girlతో పరిచయం పెంచుకున్న యువకుడు ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఆమెపై molestationకి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలి లంకకు చెందిన గ్రామ వాళ్లంటే బూసి సతీష్ (23) అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నమ్మించి అఘాయిత్యానికి తెగబడ్డాడు.
ఆ తరువాత ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించాడు. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ ఆర్.కె.శుభ శేఖర్ తెలిపారు.
ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల కు చెందిన గ్రామ వాలంటీర్ ఒక బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్టోబర్ 22న Village Volunteer మల్ల గోపి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు.
ఆ సమయంలో అతని భార్య ఇంట్లో ఉంది. ఆమె బాలింత. భర్త లేడని చెప్పడంతో అతని ఫోన్ నెంబర్ కావాలని అడుగుతూ ఆమెతో misbehave చేశాడు. వాలంటీర్ చర్యతో షాక్ అయిన ఆమె.. ఉన్న ఫలానా బయటకు పరుగులు తీసింది. అతని ప్రవర్తనతో భయపడిపోయింది. ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ ఫోన్ తీసుకుని విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది.
వెంటనే అక్కడికి husband చేరుకునేసరికి వాలంటీర్ పరారయ్యాడు. దీనిపై బాధితురాలు మరుసటి రోజు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఘటన మీద విచారించిన పోలీసులు.. ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు.
వాలంటీర్ మీద చర్యలు తీసుకోవాలి : వాసిరెడ్డి పద్మ ఆదేశం
బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషన్ SHOతో ఆమె సోమవారం ఫోన్లో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించే ఏ స్థాయి ఉద్యోగి నైనా క్షమించరాదు అని Vasireddy Padma అన్నారు. విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడి విషయంలో కఠినమైన చర్యలు చేపట్టారన్నారు. గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ లో మానసిక దివ్యాంగురాలు పై అత్యాచార ఘటనపై, చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఏలూరు సబ్ రిజిస్టర్ ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనల పై పోలీసు ఉన్నతాధికారులతో ఆమె మాట్లాడారు.
