Asianet News TeluguAsianet News Telugu

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ, సంక్షేమ పథకాలపై యోగి ఉన్నతాధికారి ప్ర‌శంస‌లు

Vijayawada: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గ్రామ సచివాలయ వ్యవస్థ, సంక్షేమ పథకాలపై ప్ర‌శంస‌లు కురిపించారు.
 

Vijayawada : Uttar Pradesh CM Yogi adityanath govt official lauds AP village secretariat system, welfare schemes
Author
First Published Jan 25, 2023, 9:56 AM IST

AP village secretariat system, welfare schemes : ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న పాలనపై ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు యోగి ఆదిత్యానాథ్ నాయకత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒక‌రు ప్ర‌శంస‌లు కురిపించారు. ముఖ్య‌మంగా ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ ఒక విప్లవాత్మక భావన అని, ఇక్కడ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి బాగా ప్రచారం చేయాలని, తద్వారా ఇతర రాష్ట్రాలు వాటి గురించి తెలుసుకుని, వాటిని తమ రాష్ట్రాల్లో స్వీకరించాలని ఆయ‌న అన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక సలహాదారు సాకేత్ మిశ్రా మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గ్రామ సచివాలయ వ్యవస్థ, సంక్షేమ పథకాలపై ప్ర‌శంస‌లు కురిపించారు. గతంలో కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలం వణుకూరులోని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లు, డాక్టర్ వైఎస్ఆర్ సంచర పసు ఆరోగ్య సేవా కేంద్రం పనితీరుపై మిశ్రా అధ్యయనం చేశారు. జగన్ మోహన్ రెడ్డితో తన అభిప్రాయాలను పంచుకున్న ఆయన, ఏపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు.

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తన పర్యటన మంచి అనుభూతినిచ్చిందని మిశ్రా అన్నారు. “క్షేత్ర స్థాయిలో, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు-మెరుగుదలలను నేను వ్యక్తిగతంగా గమనించాను. ఇలాంటి ప్రయోజనాలు చివరి వ్యక్తికి కూడా చేరేలా సీఎం చేస్తున్న కృషిని అభినందించాల్సిందే. అటువంటి కార్యక్రమాల వెనుక ఉన్న లక్ష్యాలు-ఉద్దేశాలను నేను ముఖ్య‌మంత్రితో చర్చించాను” అని సాకేత్ మిశ్రా తెలిపారు. “ప్రతి రాష్ట్రం భిన్నంగా ఉంటుంది. ప్రతి రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుండి నేర్చుకోవాలని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను కొనియాడారు. వాటికి ప్ర‌చారం క‌ల్పించ‌డంతో పాటు ఇత‌ర రాష్ట్రాలు సైతం స్వీక‌రించాల‌ని పేర్కొన్నారు. 

సాకేత్ మిశ్రా మాట్లాడుతూ.. “ప్రజలు ఏ ఉద్దేశానికైనా వివిధ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దానికంటే, గ్రామ సచివాలయంలో ప్రతిదానికి పరిష్కారం లభించడం విప్లవాత్మకమైన పురోగతి అని నేను భావిస్తున్నాను. టెక్నాలజీని అన్ని రంగాల్లో సమర్థంగా ఉపయోగిస్తున్నారు. పలు కార్యక్రమాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో వనరులను వినియోగించుకున్న తీరు అద్భుతంగా ఉంది’’ అని అన్నారు.  ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌పై ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. 

అలాగే, “డ్రోన్ల వ్యవస్థ రైతులకు అందుబాటులోకి రావడంతో నేను కూడా ఆకర్షితుడిన‌య్యాను. కేవలం 10 నిమిషాల్లో ఎకరానికి పిచికారీ చేయడం చాలా మంచిది. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు ఇలా అన్నీ ఒకే చోట లభిస్తాయి. విత్తనం నుంచి అమ్మకం వరకు రైతుకు ఆర్‌బీకే పూర్తి సేవలందించడంతో రైతులకు ఇబ్బంది లేదు. రైతులు ఈ-క్రాపింగ్ ద్వారా ముందస్తుగా నమోదు చేసుకుని, పంట విక్రయ సమయంలో ఎంత పరిమాణంలో విక్రయిస్తున్నారో, ఎంత రేటుకు లభిస్తున్నదో అక్కడికక్కడే తెలుసుకుంటే బాగుంటుంది’’ అని తెలిపారు. వ్యవసాయోత్పత్తుల సేకరణ, మద్దతు ధర కల్పించడం వంటి ప్రతి విషయంలోనూ రైతుకు అండగా నిలుస్తున్న ప్రభుత్వ చర్యలు చాలా బాగున్నాయని సాకేత్ మిశ్రా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios