విజయవాడ: సత్తెనపల్లిలో టీడీపీ కౌన్సిలర్ బి.మనోహర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.సత్తెనపల్లిలోని నాలుగో వార్డు నుండి  మనోహర్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 

మనోహర్ నుండి  మూడు లక్షలు ఓ మహిళ తీసుకొంది. ఇందులో రూ.1.50 లక్షలు తిరిగి ఇచ్చారు. మిగిలిన డబ్బుల కోసం కూడ కౌన్సిలర్ ఒత్తిడి తెచ్చాడు. అయితే ఈ డబ్బులు చెల్లించడానికి మరింత సమయం ఇవ్వాలని ఆమె కోరింది. కానీ అతను ఒప్పుకోలేదు.

ఈ డబ్బులు చెల్లించడానికి  మరింత సమయం ఇవ్వడానికి తన కోర్కె తీర్చాలని వేధింపులకు గురి చేసినట్టుగా బాధితురాలు ఆరోపించింది. లేదా వెంటనే తన డబ్బులను చెల్లించాలని కోరింది.

తమ ఇంట్లోకి వచ్చి తన కోర్కె తీర్చాలని వేధింపులకు గురి చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు వీడియో క్లిప్పులను ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.