విజయవాడ: ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్యతేజ హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీస్ కస్టడీకి కోర్టు అంగీకరించింది.

ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు నాగేంద్రను కస్టడీకి ఇస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు సోమవారం నాడు ఆదేశించింది. ఈ కేసులో నిందితుడి నాగేంద్ర నుండి ఇంకా వివరాలను చేపట్టాల్సిన అవసరం ఉందని విజయవాడ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నాగేంద్రను కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాల్సిన అవసరం ఉందని కోరారు. దీంతో నాగేంద్రను కస్టడీకి ఇస్తూ  కోర్టు ఇవాళ  అంగీకరించింది.

ఈ నెల 18వ తేదీన జైలు నుండి దిశ పోలీసులు నాగేంద్రను కోర్టు నుండి తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ విషయమై మచిలీపట్నం, రాజమండ్రి జైళ్ల అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు.

also read:దివ్య కేసు: పోలీసుల అదుపులో నాగేంద్ర.. ఛార్జిషీటు దాఖలు చేసిన దిశా టీమ్

ఈ నెల 6వ తేదీన నాగేంద్రను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన దివ్యతేజను నాగేంద్ర కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తనను తాను గాయపర్చుకొన్నాడు.

నాగేంద్ర దాడిలో దివ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఈ నెల 6వ తేదీ డిశ్చార్జ్ అయ్యాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం  తెలిసిందే.