విజయవాడ: పగటిపూట కర్ప్యూ నిబంధనలను పాటించని వారిపై పోలీసులు  కఠినంగా వ్యవహరిస్తున్నారు. 4 రోజుల వ్యవధిలోనే  రూ. 16 లక్షల జరిమానాను విజయవాడ పోలీసులు వసూలు చేశారు. ఈ నెల 5వ తేదీ నుండి ఏపీ రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తోంది. మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు తెరుచుకొనేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. పగటి పూట కర్ఫ్యూ నిబంధనలను బేఖాతరు చేసిన వారిపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు.  అంతేకాదు జరిమానాలు కూడ విధించారు. నాలుగురోజులుగా  నిబంధనలు పాటించనివారిపై కేసులు కూడ నమోదు చేశారు. 

also read:ఏపీలో ప్రారంభమైన పగటిపూట కర్ఫ్యూ : ప్రజా రవాణా బంద్

కర్ఫ్యూ నిబంధనలు పాటించకపోవడంతో 169 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. 37 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 300 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.అత్యవసర సేవల కోసం వచ్చేవారి పత్రాల పరిశీలించిన తర్వాతే  అనుమతి ఇస్తున్నట్టుగా విజయవాడ పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల కర్ఫ్యూను అమలు చేస్తోంది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ను వేగవంతం  చేయడం ద్వారా కరోనాను కొంతమేరకు కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.