వైసీపీ  ఎమ్మెల్యే  జగన్మోహన్ రావుపై  విజయవాడ  ఎంపీ కేశినేని నాని  ప్రశంసలు  కురిపించారు. 

విజయవాడ: ఎన్నికల వరకే రాజకీయాలకు పరిమితం కావాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు.ఆదివారంనాడు నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు తో కలిసి చందర్లపాడులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ది పనుల విషయంలో ఎమ్మెల్యే జగన్మోహన్ రావు రాజీపడరన్నారు. అభివృద్ది కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎంపీ చెప్పారు. వైసీపీ, టీడీపీ సిద్దాంతాలు వేరైనా అభివృద్ది కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఈ ప్రాంతంలో వైసీపీ, టీడీపీ నేతలు కలిసి పనిచేయడాన్ని ఎంపీ కేశినేని నాని అభినందించారు. అధికార, విపక్ష నేతలు కలిసి పనిచేస్తే దేశం అభివృద్ది చెందుతుందన్నారు. అభివృద్ధి కోసం పనిచేసిన నేతలపై ఎంపీ కేశినేని ప్రశంసలు కురిపించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏం చేసినా సంచలనమే. 2019 లో విజయవాడ నుండి మరోసారి విజయం సాధించిన తర్వాత కేశినేని నాని ఏదో కామెంట్ చేస్తూ మీడియాలో పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. స్వంత పార్టీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా విమర్శలు చేసిన సందర్భాలు కూడ లేకపోలేదు. సోదరుడు కేశినేని చిన్నిపై నాని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన విషయం తెలిసిందే.

 విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కేశినేని చిన్ని కూడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిన్ని సహా కొందరికి పార్టీ టిక్కెట్టు ఇస్తే వారి ఓటమి కోసం పనిచేస్తానని కూడా కేశినేని నాని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇవాళ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే జగన్మోహన్ రావుపై కేశినేని నాని ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.