అక్రమ వాహనాల కేసు: జేసీ ప్రభాకర్ రెడ్డికి కోర్టు సమన్లు

అక్రమ  వాహనాల  కేసులో  మాజీ  ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డికి  కోర్టు  సమన్లు  జారీ చేసింది  మార్చి  1వ తేదీన  విచారణకు  రావాలని ఆదేశించింది  కోర్టు. 

 Vijayawada  Court  issues  notice To  TDP Leader  JC Prabhakar Reddy

అనంతపురం: అక్రమ వాహనాల కేసులో  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డికి  ప్రజా ప్రతినిధుల కోర్టు  సమన్లు  జారీ చేసింది.  ఈ  ఏడాది మార్చి  1వ తేదీన  విచారణకు  రావాలని  కోర్టు  సమన్లు  పంపింది. జేసీ ప్రభాకర్ రెడ్డి సహ  మరో  18  మందికి  కోర్టు  సమన్లు  జారీ చేసింది. 

అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్  కేసులో  2020  జూన్  13న  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి  , ఆయన  తనయుడు అస్మిత్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  హైద్రాబాద్ లో  అరెస్ట్  చేసి వారిని  అనంతపురానికి అప్పట్లో  తీసుకెళ్లారు.

 తప్పుడు పత్రాలతో 154 వాహనాలను  రిజిస్ట్రేషన్ చేయించారని  జేసీ ప్రభాకర్ రెడ్డిపై  పోలీసులు  కేసు నమోదు చేశారు.  అక్రమంగా  తమపై  కేసులు నమోదు  చేశారని  జేసీ  ప్రభాకర్ రెడ్డి అప్పట్లో నే ప్రకటించారు.  ఈ కేసును  ఈడీ కూడా విచారిస్తుంది.  

2022 అక్టోబర్ 7, 8 తేదీల్లో  ఈడీ అధికారులు  జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారించారు. అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో  ఈడీ అధికారులు  విచారణ నిర్వహించారు.  బీఎస్ -3 వాహనాలను బీఎస్-4 గా మార్చి  రిజిస్ట్ట్రేషన్ చేశారని  జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదు  చేశారు.

గత ఏడాది అక్టోబర్  7వ తేదీన  ఐదుగంటల పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిని  ఈడీ అధికారులు విచారించారు.  అక్టోబర్  8వ తేదీన  సుమారు  10 గంటల పాటు  జేసీ ప్రభాకర్ రెడ్డిని  ఈడీ అధికారులు విచారించారు. గడువు తీరిన 154 వాహనాలను   నాగాలాండ్ లో స్క్రాప్ కింద కొనుగోలు చేసి తప్పుడు పత్రాలతో  రిజిస్ట్రేషన్ చేయించారని  జేసీ ప్రభాకర్ రెడ్డిపై  కేసులు  నమోదు చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios