Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ రాహుల్ హత్య కేసు: పోలీస్ కస్టడీకి కోగంటి సత్యం.. కోర్ట్ అనుమతి

విజయవాడలో యువ వ్యాపారవేత్త రాహుల్ కరణం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న కోగంటి సత్యంను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోగంటి సత్యంను ప్రశ్నిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం వుందని పోలీసులు భావిస్తున్నారు. 
 

vijayawada Court Allows Two Days Custody To Police For koganti satyam in rahul karanam murder case
Author
Vijayawada, First Published Sep 1, 2021, 7:58 PM IST

విజయవాడలో యువ వ్యాపారవేత్త రాహుల్ కరణం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న కోగంటి సత్యంను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోగంటి సత్యంను ప్రశ్నిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం వుందని పోలీసులు భావిస్తున్నారు. రాహుల్ హత్య కేసులో ఇప్పటి వరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే మరో ఇద్దరు నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

కాగా, వ్యాపార లావాదేవీలే జిక్సిన్ సిలిండర్ల వ్యాపారి కరణం రాహుల్ హత్యకు కారణమని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. జిక్సిన్ సిలిండర్ల ఫ్యాక్టరీ ఎండీ కరణం రాహుల్ హత్య కేసులో  ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. శుక్రవారం నాడు ఆయన విజయవాడలో తన కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు.   కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చొన్న రాహుల్ ను వెనుక నుండి సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైర్ తో చంపారని  సీపీ చెప్పారు.  ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ తెలిపారు.

ఫ్యాక్టరీ విషయమై కోరాడ విజయ్ కుమార్ తో రాహుల్ కు వబేధాలొచ్చాయని సీపీ శ్రీనివాసులు తెలిపారు.  రాహుల్ హత్య కేసులో మొత్తం 13 మంది ఉన్నారని సీపీ తెలిపారు. అయితే ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ కేసులో ఇంకా కొందరి అనుమానితుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నామన్నారు. 

పార్మింగ్ చేసిన ప్రాంతంలోనే కారులోనే రాహుల్ ను నిందితులు హత్య చేశారని సీపీ చెప్పారు.  రాహుల్ ను కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ లు బెదిరించారని  తమ దర్యాప్తులో తేలిందని సీపీ వివరించారు.  రాహుల్ ను బెదిరించి  కొన్ని డాక్యమెంట్లపై కూడా సంతకాలు తీసుకొన్నారని సీపీ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios