పెద్దఅవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసు: కేసు కొట్టివేత

కృష్ణా జిల్లాలోని పెద్దఅవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులను  కోర్టు నిర్ధోషులుగా  ప్రకటించింది. 

Vijayawada  Court  Acquitted Accused  Pedda avutapalli Triple Murder Case  lns

విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  పెద్దఅవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులో  నిందితులు  కోర్టు నిర్ధోషులుగా తేల్చింది.  ఈ కేసును కొట్టివేసింది.  2014 సెప్టెంబర్ 24వ తేదీన  ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి  సమీపంలోని జాతీయ రహదారిపై  కారులో వెళ్తున్న  గంధం నాగేశ్వరరావు  ఆయన ఇద్దరు కొడుకులు  పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలను నిందితులు హత్య చేశారు.

పశ్చిమ గోదావరి  జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కొడుకులు  పగిడి మారయ్య, గుంజుడు మారయ్యను ఢిల్లీకి చెందిన కిరాయి హంతకులు దారుణంగా హత్య చేశారు.  గన్నవరం ఎయిర్ పోర్టు నుండి  కారులో పశ్చిమ గోదావరి జిల్లా  పినకమిడికి కారులో వెళ్తున్న సమయంలో  ఈ హత్య జరిగింది.   కారులో  ఈ ముగ్గురిని వెంబండించి   ముగ్గురిని  హత్య  చేశారు నిందితులు. 

పినకమిడికి చెందిన భూతం బాలాజీ, మహేష్, శివలు   ఈ ముగ్గురిని హత్య చేయడంలో కీలకంగా వ్యవహరించారని  అప్పట్లో పోలీసులు ప్రకటించారు.  ఈ విషయమై  ఢిల్లీకి చెందిన వ్యక్తులకు  సుఫారీ ఇచ్చి   హత్య చేయించారని  పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసుకు సంబంధించి విజయవాడ అదనపు  జిల్లా జడ్జి ఈ కేసును కొట్టివేసింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios