Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ బస్సు భీభత్సం... ఎంత భయానకంగా జరిగిందో చూడండి.. (వీడియో)

విజయవాడ బస్టాండ్ జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. 

Vijayawada Bus Accident Video AKP
Author
First Published Nov 7, 2023, 9:05 AM IST

విజయవాడ : విజయవాడ బస్టాండ్ లో ఆర్టిసి బస్సు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. విజయవాడ నుండి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు అదుపుతప్పి బస్టాండ్ లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులు ఫస్ట్ గేర్ వేయడంతో వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్లాట్ ఫారం నుండి బస్టాండ్ లోని దూసుకెళ్లి ఓ కండక్టర్ తో పాటు మహిళ, పదినెలల చిన్నారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు బస్సు చక్రాలకింద నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. 

ఈ భయానక బస్సు ప్రమాద దృశ్యాలను ఎవరో వీడియో తీసారు. బస్సు ఒక్కసారిగా బస్టాండ్ లోకి దూసుకువచ్చి కూర్చీలపై కూర్చున్న కండక్టర్, తల్లీబిడ్డపైకి దూసుకెళ్లిన భయానక దృశ్యాలతో కూడిన వీడియో బయటకు వచ్చింది.

వీడియో 

Follow Us:
Download App:
  • android
  • ios