ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు మరోమారు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలతో కాపురం చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులిచ్చి మళ్లీ పెళ్లిళ్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు. 

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు మరోమారు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలతో కాపురం చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులిచ్చి మళ్లీ పెళ్లిళ్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీలలో ఏ ఒక్కటి సరిగ్గా అమలు కాలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా హైకోర్టు భవనం ఎందుకు నిర్మించలేదని విమర్శించారు. ఏపీ హైకోర్టు భవనాల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. 

హైకోర్టును హైదరాబాద్‌ నుంచి అమరావతికి తీసుకురావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. చంద్రబాబు ప్రతీ కార్యక్రమాన్నిశంకుస్థాపనలతో చంద్రబాబు జనాలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 

రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన విధంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ సిద్ధాంతాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు పవన్‌తో గతంలో వివాహం చేసుకుని విడాకులు ఇచ్చి మళ్లీ వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. చంద్రబాబుకు నారా పవన్‌ రాహుల్‌ నాయుడని సముచితమైన పేరు ఉందని వ్యాఖ్యానించారు.